మహేష్ బాబు మల్టీప్లెక్స్ లో వ్యోమగామి
- December 06, 2018
మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ తో కలిసి నిర్మించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ఇటీవలే ఓపెన్ అయ్యింది, సూపర్ స్టార్ కృష్ణ గారు AMB సినిమాస్ మల్టీప్లెక్స్ కి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లో AMB సినిమాస్ కి జనాల తాకిడి చాలా హెవీ గా ఉంది. ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కాకముందే,అఖిల్ హీరో గా నటిస్తున్న 'MR.మజ్ను' సినిమా షూటింగ్ AMB సినిమాస్ లో షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు మెగా హీరో, తన సినిమా ట్రైలర్ ని AMB సినిమాస్ లో రిలీజ్ చేయనున్నాడు.
మెగా హీరో వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న 'అంతరిక్షం 9000 KMPH' సినిమా డిసెంబర్ 21 న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 9న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని AMB సినిమాస్ లో నిర్వహించాలి అని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారు, డిసెంబర్ 9న AMB సినిమాస్ లో ట్రైలర్ లాంచ్ కి సర్వం సిద్ధం చేస్తున్నారు, దసరా కి వచ్చిన 'అంతరిక్షం 9000 KMPH' టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
వరుణ్ఈ తేజ్ సినిమాలో వ్యోమగామి పాత్రలో కనిపించనున్నాడు. అదితి రావ్ హైదారి - లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దర్శకుడు క్రిష్ రాజీవ్ నిర్మించారు. 'ఘాజి' మూవీ కి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం 9000 KMPH' సినిమాకు దర్శకత్వం వహించాడు.
రానున్న రోజుల్లో చాలా మంది సినిమా వాళ్ళు వాళ్ళ షూటింగ్స్ మొదలు, ఈవెంట్స్ వరకు AMB సినిమాస్ లో నిర్వహించాలి అని నిర్ణయించుకున్నారు, హైదరాబాద్ లో ఒక లగ్జరీ మల్టీప్లెక్స్ గా AMB సినిమాస్ కు మంచి పేరు వచ్చింది, ఈ మల్టీప్లెక్స్ ని సందర్శిన ప్రతి ఒక్కరు ప్రశంసలతో మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ తరువాత ఒక మల్టీప్లెక్స్ కి ఇంత ఆదరణ దక్కడం ఇదే మొదటి సారి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ అలాంటిది మరి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







