మన ముందుకు వస్తున్న 'ఆక్వామేన్'
- December 06, 2018
మల్టీప్లెక్స్ ట్రెండ్ పెరిగిన తర్వాత త్రీడి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు ఆడియెన్స్. ఇటీవల విడుదలైన '2.ఓ' త్రీడిలో ఆకట్టుకుంటోంది. తాజాగా హాలీవుడ్ మూవీ 'ఆక్వామేన్' త్రీడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
త్రీడిలో '2.ఓ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, ఎన్.వి.ప్రసాద్, యు.వి.క్రియేషన్స్ వంశీ.. తమ 'ఎన్.వి.ఆర్' సంస్థ ద్వారా మరో త్రీడి సినిమా 'ఆక్వామేన్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డి.సి. కామిక్స్ క్యారెక్టర్ 'ఆక్వామేన్' పేరుతో తెరకెక్కిన ఈ హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ చిత్రం అమెరికాలో ఈనెల 21న విడుదలవుతుంటే ఇండియాలో ఒక వారం ముందుగా ఈనెల 14నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ ఏడాది విడుదలైన 'బ్లాంక్ ఫాంథర్', 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్ డమ్', 'మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్' వంటి హాలీవుడ్ చిత్రాలు.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాయి. ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనువాద రూపంలో విడుదలై ఇక్కడ స్ట్రెయిట్ సినిమాలకు దీటుగా కలెక్షన్లను సాధించాయి. ఈనేపథ్యంలో ఈ ఏడాది చివరి హాలీవుడ్ బడా మూవీగా రాబోతున్న 'ఆక్వామేన్'పై అంతటా ఆసక్తి నెలకొంది. 160 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' ఫేమ్ జేమ్స్‌వేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జేసన్ మమోవా టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో అలరించబోయే 'ఆక్వామేన్' తెలుగులో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







