పారిస్‌లో ఆందోళనలు, ఈఫిల్ టవర్ మూసివేత.!
- December 07, 2018
పారిస్: ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో శనివారం పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను మూసివేయనున్నారు. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ గళమెత్తిన విషయం తెలిసిందే. రెండు వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు చేతుల్లో రాడ్లు, గొడ్డళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వాహనాలు, ఇళ్లను తగులబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దేశవ్యాప్తంగా 89 వేల పోలీసు ఆఫీసర్లు డ్యూటీలో ఉన్నారు. ఆర్మీ వాహనాలను కూడా మోహరించారు. పారిస్‌లో ఉన్న షాపులు, రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. యెల్లో వెస్ట్ పేరుతో ఫ్రాన్స్‌లో నవంబర్ 17 నుంచి ఉద్యమం సాగుతున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







