తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్ రుసుం ఎత్తివేత
- December 07, 2018
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు టోల్ రుసుం ఎత్తివేశారు. టోల్ రుసుం ఎత్తివేయాలని అన్ని టోల్‌ప్లాజాలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవో రజత్‌కుమార్ సీఎస్‌ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్ రుసుం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్‌ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం టోల్‌ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







