నయనతారనే కొరటాల ఫిక్స్ చేశాడట!
- December 08, 2018
కొరటాల శివ తన తదుపరి సినిమాను చిరంజీవితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకున్నారనేది తాజా సమాచారం. ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో అనుష్క .. నయనతార .. త్రిష .. శ్రియ మాత్రమే సీనియర్ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీళ్లందరిలో తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ వున్న కథానాయిక నయనతార మాత్రమే. అందుకనే 'సైరా' కోసం ఆమెనే తీసుకున్నారు. కొరటాల సినిమా విషయంలోను కథానాయిక సమస్య తలెత్తింది. పాత్ర పరంగాను .. తన క్రేజ్ కి తగిన జోడీగాను నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి అనడంతో, ఆమెనే కొరటాల ఖరారు చేశారని చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







