ఎన్టీఆర్ బయోపిక్ లో రాఘవేంద్ర రావు ..
- December 08, 2018
ఎన్టీఆర్ బయోపిక్ పేరిట డైరెక్టర్ క్రిష్ తారకరామారావు జీవిత కథ ను ప్రేక్షకులకు అందించబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా, బసవతారకం రోల్ లో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తుంది. ఇక మిగతా పాత్రల్లో ఎంతోమంది అగ్ర నటి నటులు, దర్శకులు, నిర్మాతలు నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం.
ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు కలయికలో ‘వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు’ లాంటి పలు హిట్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అందుకే ఎన్టీఆర్ సినీ కెరీర్లో దర్శకేంద్రుడిది ప్రత్యేక స్థానం. ఈ నేపథ్యంలో ఆయన పాత్రను క్రిష్ చూపించబోతున్నాడు. ఈ పాత్రలో దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ నటించనున్నాడు. మొదటి హీరోగా పరిచయమైన ప్రకాష్ ఆ తరవాత దర్శకుడిగా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు చాల రోజుల తర్వాత తెరపై కనిపించబోతున్నాడు.
జనవరి 09 న ఈ చిత్ర మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్ బి కె బ్యానర్ ఫై బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







