పీవీ సింధు కి కోచ్ గా సోనూసూద్
- December 11, 2018
బాలీవుడ్లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. బయోపిక్ లకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరహా సినిమాలు అక్కడ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ఇక మరో వైపున బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి సోనూసూద్ సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో ప్రతినాయక పాత్రధారిగా సోనూసూద్ కి మంచి గుర్తింపు వుంది. పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. పీవీ సింధు బాల్యం నుంచి ఒలంపిక్ మెడల్ సాధించేవరకూ ఈ కథ కొనసాగుతుంది. ప్రధానపాత్రను పోషించే నటి కోసం అన్వేషిస్తున్నారు. ఈ సినిమాలో పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను సోనూ సూద్ పోషించనుండటం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







