ఏడేళ్ల బుడతడు.. ఏడాదిలో రూ.150 కోట్లు..!
- December 11, 2018
ఏడేళ్ల కుర్రాడు అంటే ఎలా ఉంటాడు.. ‘ఇల్లు పీకి పందిరేస్తాడు’. అల్లరి చేస్తూ.. అమ్మ చెంగు లాగుతూ.. ఒక్క క్షణం కూడా ఉన్న చోట ఉండడు. తన అల్లరి తట్టులేక అమ్మ ఆట బొమ్మలు ఇస్తే.. వాటి అంతు చూసే వరకు వాటిని వదిలిపెట్టరు ఈ వయసు చిన్నారులు. బొమ్మలని ఇంటికి తెచ్చిన కొద్ది క్షణాల్లోనే భరతం పట్టే బంగారు కొండలు ఉన్నారు. కానీ ఇలాంటి బొమ్మలతోనే ఆడుకుంటూ మిలియనీర్ అయ్యాడు ఏడేళ్ల బుడతడు. నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే రూ.150కోట్లు సంపాదించాడు. ఇది కేవలం ఒక సంవత్సరంలో సంపాదించింది మాత్రమే. చదవటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజంగా నిజం.
అమెరికాకు చెందిన ర్యాన్ అనే ఏడేళ్ల చిన్నోడు.. నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు. మార్కెట్లోకి కొత్తగా బొమ్మ వస్తే అది ర్యాన్ ముందు ఉండాల్సిందే. వాటిని తీసుకుని అవి ఎలా పనిచేస్తాయో అందరికీ చెబుతాడు. ఇందు కోసం ఈ బుడతడు 2015లో ‘ర్యాన్ టాయ్స్ రివ్యూ’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్లోడ్ చేయటం మొదలు పెట్టాడు. అంతే తక్కువ సమయంలో లక్షలమంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుండటంతో.. తన యూట్యూబ్ ఛానల్ కి యాడ్స్ వచ్చాయి. వాటితోపాటే తన బ్యాంక్ ఖాతాలోకి ఆదాయం కూడా వచ్చి చేరింది. దీంతో ఈ బుడతడు యూట్యూబ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న వారి జాబితాలో తొలి స్థానం సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ గతేడాది విడుదల చేసిన జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ర్యాన్.. ఈసారి తన సంపాదన రెట్టింపు చేసుకుని ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







