దుబాయ్ గార్డెన్ గ్లో సందర్శకుల కోసం సిద్ధం
- December 23, 2015
ప్రపంచంలోనే అతి పెద్దదైన, ప్రత్యేకమైన 'గ్లో డెస్టినేషన్'గా పేర్కొనబడ్తున్న దుబాయ్ గార్డెన్ గ్లో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ గార్డెన్‌లోకి ప్రవేశించడానికి 60 దిర్హామ్‌లను రుసుముగా నిర్ణయించారు. యూఏఈ నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ అహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూతాహ్, ఇతర ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాజర్ లూతాహ్ మాట్లాడుతూ, నాలుగు మిలియన్ల లైట్లు వివిధ రంగుల్లో ఈ పార్కులో దర్శనమిస్తాయన్నారు. వచ్చే రంజాన్ వరకూ సందర్శకుల్ని ఈ గార్డెన్ విశేషంగా ఆకట్టుకోనుంది. 'ఆర్ట్ బై డే, గ్లో బై నైట్' అనే కాన్సెప్ట్‌తో చెట్లు, మొక్కలు, పువ్వులు, చీమలు, ఇతర జంతువులు గార్డెన్‌లో పొందుపర్చారు. రీసైకిల్ చేసిన సిల్క్‌ని గ్లోయింగ్ టచ్ కోసం వినియోగించారు. 40 ఎకరాల ఈ గార్డెన్‌లోకి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారు. అయితే ప్రవేశ రుసుముపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







