చండీయాగం గురువారం రెండోరోజుకు
- December 23, 2015
మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం గురువారం రెండోరోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థనతో యాగం ప్రారంభించారు. గోపూజ, ఏకాదశ న్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, యోగినీ బలి, మహాధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, మహాసౌరము, ఉక్తదేవతా జపాలు, కుమారి, సువాసినీ, దంపతీపూజా, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి ధార్మిక ప్రవచనం ఉంటుంది. సాయంత్రం కోటి నవాక్షరీ పురశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టావధాన సేవ, ప్రసాద వినియోగం. రాత్రి 7.30గంటలకు శ్రీరామలీల (హరికథ). రెండో రోజు అయుత చండీయాగానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. యాగశాల వద్ద సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









