రియాద్‌లో కొరియన్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

- December 19, 2018 , by Maagulf
రియాద్‌లో కొరియన్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

రియాద్‌: సౌదీ కమిషన్‌ ఫర్‌ టూరిజం అండ్‌ నేషనల్‌ హెరిటేజ్‌ ప్రెసిడెంట్‌ ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ సల్మాన్‌, రియాద్‌లో కొరియన్‌ హిస్టరీ అండ్‌ కల్చర్‌ని ప్రదర్శించేందుకు ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. కొరియాలోని సియోల్‌ నేషనల్‌ మ్యూజియమ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ బీ కిడోంగ్‌, సౌదీ అరేబియాలో కొరియన్‌ అంబాసిడర్‌ బ్యుంగ్‌ వూక్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ సల్మాన్‌. %కొరియన్‌ హిస్టరీ అండ్‌ కల్చర్‌ - ఎన్‌ఛాంటింగ్‌ జర్నీ టు ది కొరియన్‌ సివిలైజేషన్‌' పేరుతో ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటయ్యింది. మార్చి 7 వరకు ఈ ఎగ్జిబిషన్‌ కొనసాగుతుంది. సౌదీ అరేబియాలో ఈ తరహా ఎగ్జిబిషన్‌ ఇదే తొలిసారి. ప్రిన్స్‌ సుల్తాన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్చర్‌, ఆర్కియాలజీ విభాగాల్లో ఈ తరహా స్నేహ సంబంధాలు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కొరియా ప్రజలు, ప్రభుత్వం తరఫున ప్రొఫెసర్‌ బీ, కింగ్‌డమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com