వలసదారులకు ఉచిత హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డులు
- December 19, 2018
దుబాయ్ హెల్త్ అథారిటీ, 100 హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డుల్ని ఇయర్ ఆఫ్ జాయెద్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఎంపిక చేయబడ్డ వలసదారులకు అందించనుంది. 'ఇయర్ ఆఫ్ జాయెద్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్' పేరుతో, ఎసెన్షియల్ బెనిఫిట్స్ ప్యాకేజీ కింద అత్యధికంగా 150,000 దిర్హామ్‌ల లిమిట్‌తో ఈ కార్డుల్ని ఏడాది కాలానికి చెల్లుబాటు అయ్యే విధంగా రూపొందించారు. డిహెచ్‌ఎ హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ అడ్వయిజర్ సలెహ్ అల్ హాషిమి మాట్లాడుతూ, 100 మంది లబ్దిదారులు ఇప్పటికే ఎంపికైనట్లు తెలిపారు. ఆయా వ్యక్తుల ఫైనాన్షియల్ నీడ్స్‌కి అనుగుణంగా ఆయా వ్యక్తుల్ని ఈ పథకానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎమర్జన్సీ ఖర్చులు, మెటర్నిటీ సమస్యలు, సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వంటివి ఈ ఇబిపిలో కవర్ అవుతాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







