బీన్స్‌తో చేసిన జ్యూస్ సేవిస్తే..
- December 24, 2018
బీన్స్ ఎముకల బలాన్ని పెంచుటలో చాలా దోహదపడుతుంది. దీనిలోని విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ వంటి పదార్థాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూవారి ఆహారంలో బీన్స్ చేర్చుకుంటే.. పలురకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీన్స్‌తో తయారుచేసిన జ్యూస్ తీసుకుంటే కంటి చూపుకు చాలా మంచిదని చెప్తున్నారు. బీన్స్‌లోని మరికొన్ని ప్రయోజనాలు...
1. బీన్స్‌ను చిన్న చిన్నవిగా కట్ చేసుకుని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిలో కొద్దిగా ఉప్పు, నీరు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు, కరివేపాకు, కొబ్బరి తురుము, ఎండుమిర్చి పొడి వేసి బాగా వేయించి ఆపై ఉడికించిన బీన్స్ వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఇలా చేసిన వేపుడును గర్భిణులు తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
2. బీన్స్‌ను కూర రూపంలో తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. బాలింతలు పలురకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వాటి నుండి ఉపశమనం పొందాలంటే.. బీన్స్ తరచు తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు దరిచేరవు.
3. బీన్స్‌లోని ఫైబర్ అనే పదార్థాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా సహాయపడుతుంది. అధిక బరువు గలవారు బీన్స్ తింటే నెలరోజుల్లో స్లిమ్‌గా మారుతారు. దాంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
4. బీన్స్‌లోని గింజలను వేరుచేసి వాటిని బాగా ఎండబెట్టుకోవాలి. తరువాత వాటిని మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకో గ్లాస్ తీసుకుంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి.
5. బీన్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. తరచు తలనొప్పిగా ఉన్నప్పుడు.. బీన్స్ రసంలో కొద్దిగా తైలం కలిపి నుదిటిపై రాసుకోవాలి. ఇలా చేస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.
6. చాలామందికి శరీరంలోని ఎముకలు బలాన్ని కోల్పోతుంటాయి. దాని కారణంగా గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కుంటారు. దీని నుండి విముక్తి చెందాలని ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితాలు కనిపించవు. అందుకు.. బీన్స్‌తో చేసిన పదార్థాలు సేవిస్తే కండరాలకు బలం చేకూరుతుందని నిపుణులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







