హైదరాబాద్:తల్లి చనిపోయిందని వైద్యులు చెప్పగానే..
- December 26, 2018
హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిపై రోగి బంధువుల దాడిని సీరియస్‌గా తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు . దాడిచేసిన నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు .. అరెస్ట్ అయిన వారిలో మోహీనోద్దీన్ అలీఖాన్, భర్కత్ అలీఖాన్, సుజత్ అలీఖాన్, మోహిన్ ఖాన్‌లు ఉన్నారు.
ఈ నెల 18న 45 ఏళ్ల షమీనా బేగం చికిత్స కోసం లక్డీకాపూల్ గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది . అప్పటికే ఆమెకు ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దాదాపు రెండు లక్షల వరకు కట్టారు షమీనా బేగం కుమారులు. అయితే ఆరు రోజుల తర్వాత… హార్ట్ హటాక్ రావడంతో.. షమీనా బేగం చనిపోయిందని వెల్లడించారు వైద్యులు.
అప్పటి వరకు సమీనా బేగం ప్రాణాలు కాపాడాలంటూ డాక్టర్లకు మొక్కుతూ.. రోధిస్తూ ఆసుపత్రి దగ్గరే ఉన్నారు ఆమె కుమారులు, బంధువులు. అయితే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పగానే.. వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అంతే అది ఆసుపత్రి అనే విషయం మరచిపోయారు.. సమీనా బేగం మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ రెచ్చిపోయి ఆసుపత్రిని ధ్వంసం చేశారు..
ఆసుపత్రి రిసెప్షన్ కౌంటర్ లోని రెండు కంప్యూటర్లుతో పాటు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వైద్యులనూ చితక్కొట్టారు. అక్కడికొచ్చిన కానిస్టేబుల్‌పైనా దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో… అదనపు బలగాలను రప్పించి.. పరిస్థితిని అదుపులో తెచ్చారు పోలీసులు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు ..
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







