భార్య మృతి: బ్లడ్ మనీ చెల్లించిన భర్త
- December 26, 2018
25 ఏళ్ళ భారతీయ మహిళ దివ్య ప్రవీణ్, రస్ అల్ ఖైమాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె భర్త 200,000 బ్లడ్ మనీ చెల్లించాల్సి వచ్చింది. అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు ఈ బ్లడ్ మనీని ఆమె భర్త చెల్లించారు. అలాగే 2,500 జరీమానా సైతం డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కి విధించడం జరిగింది. రస్ అల్ ఖైమా - ఇండియన్ రిలీఫ్ కమిటీ సోసల్ వర్కర్ పుష్పన్ గోవిందన్ మాట్లాడుతూ, 200,000 బ్లడ్ మనీ, 2,500 దిర్హామ్‌ల జరీమానా చెల్లించాక ప్రవీణ్ విడుదలయినట్లు చెప్పారు. ఇండియన్ రిలీఫ్ కమిటీ వలంటీర్ రఘు మాష్ మాట్లాడుతూ, ప్రవీణ్ స్నేహితులు, బంధువులు బ్లడ్ మనీని కోర్టుకు చెల్లించారని అన్నారు. ప్రవీణ్‌కి రెండేళ్ళ కుమారుడున్నారు. లీగల్ ఫార్మాలిటీస్ తర్వాత మృతదేహంతో ప్రవీణ్ ఇండియాకి బయల్దేరారు. ప్రవీణ్, రస్ అల్ ఖైమా హట్చిసన్ పోర్ట్స్‌లో పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రవీణ్ ప్రాణాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







