న్యూ ఇయర్ వేడుకలపై ట్రాఫిక్ ఫోకస్
- December 24, 2015
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రోడ్లపై అతి వేగంగా దూసుకుపోయేవారికి అడ్డుకట్ట వేయాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. అబుదాబీ పోలీస్ అన్ని రోడ్లపైనా నిఘా పెట్టినట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ దీనికి సంబంధించి అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రహదార్లపై మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల థ్రిల్ వచ్చినా, దాంతోపాటే ప్రమాదాలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ర్యాష్ డ్రైవింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు అధికారులు. అన్ని రోడ్లపైనా నిఘా ఉంచామనీ, వాహనదారులు జాగ్రత్తగా, సంతోషంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు తమ వారికి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కోరారు ట్రాఫిక్ అండ్ పెట్రోల్ అధికారులు.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









