ఐర్లాండ్:సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన భారతీయ విద్యార్థి
- January 05, 2019
ఐర్లాండ్:ఎత్తైన కొండ మీద నుంచి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్‌లోని క్లిఫ్స్ ఆఫ్ మోహర్ కొండ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన విద్యార్థి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. డబ్లిన్ యూనివర్సిటీలో సదరు యువకుడు విద్యనభ్యసిస్తోన్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా క్లిఫ్స్ ఆఫ్ మోహర్ నిలిచింది. ఎత్తైన కొండలు, పచ్చిక బయళ్లు, ఆహ్లాదకర వాతావరణ, పక్కనే సముద్రంతో అత్యంత సుందరమైన ప్రదేశంగా పేరుగాంచింది. ప్రకృతి సోయగాలను వీక్షించేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి కొండ అంచున నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలు పట్టుతప్పడంతో కొండమీద నుంచి జారిపడి సముద్రంలో పడిపోయాడు.
విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. హెలికాప్టర్ సహాయంతో సముద్రంలో పడిపోయిన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన విద్యార్థికి సుమారు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడి వివరాలను తెలుసుకొని కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







