అవి తింటే మజ్జిగ తీసుకోవడం తప్పనిసరి...
- January 11, 2019
మసాలా దినుసులు తింటున్నారా.. అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్నవారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తరువాత మజ్జిగ సేవించడం ద్వారా అసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది.
పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరగించుకోవాలి. కాసేపటివరు అలానే ఉంచి ఆ తరువాత చల్లార్చుకోవాలి. ఈ తులసి నీటిని ప్రతి రోజూ తాగడం వలన
పది రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలానే గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది.
ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







