చిన్న వ్యాపారులకు శుభవార్త..

చిన్న వ్యాపారులకు శుభవార్త..

గురువారం జరిగిన జీఎస్టీ మండలి 32వ సమావేశంలో… చిన్న వ్యాపారులకు వస్తు, సేవల పన్ను నుంచి ఊరట లభించింది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. సుదీర్ఘ చర్చ అనంతరం, చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ. ప్రస్తుతమున్న పరిమితిని 20లక్షల నుంచి 40లక్షల రూపాయలకు పెంచింది. అలాగే కాంపొజిషన్‌ పథకం కింద ఉండే పరిమితిని కోటి రూపాయలు నుంచి కోటిన్నర రూపాయలు పెంచారు

ఈ స్కీమ్ పరిథిలోకి చిన్న వ్యాపారులు……తమ వ్యాపారాల టర్నోవరును బట్టి తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక… కేరళలో. రెండేళ్ళపాటు జరిగే అమ్మకాలపై 1 శాతం పన్ను విధించుకునేందుకు అనుమతి ఇచ్చింది కౌన్సిల్. ఈ నిర్ణయాల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులకు ప్రయోజనం కలుగనుంది.

ప్రజలపై పన్ను భారం పడకుండా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ జీఎస్టీని సరళతరం చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే గత నెలలో 23 వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చింది. సినిమా టికెట్లు, 32 అంగుళాల వరకు టీవీలు, పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో గేమ్స్‌పై పన్ను భారం తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి జీఎస్టీని సరళతరం చేయడంతో… చిన్న వ్యాపారులకు లాభం చేకూరనుంది.

Back to Top