తిరుపతి నుంచి షిరిడీ వారాంతపు ఎక్స్‌ప్రెస్ ..
- December 26, 2015
భారత దేశంలో ఆద్యాత్మికతకు చాలా గొప్ప స్థానం ఉంది. ఇక్కడ భగవంతున్ని ఎన్నో రూపాల్లో పూజిస్తుంటారు. అన్ని మతాల ఆరాద్య దైవాలు కొలువు తీరి ఉన్నాయి. భారత దేశంలో పేరు పొందిన దేవుళ్లుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా అందరికీ తెలుసు. ఎన్నో మహిమలు గల ఈ దేవుళ్లను ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. అంతే కాదు ఆయా రాష్ట్రాలకు ఈ దేవుళ్లు కల్పతరువు లాంటి వారు. అత్యధిక భక్తులు వీక్షించే దేవుళ్లుగా ప్రసిద్ది చెందారు. అయితే తిరుపతి నుంచి షిరిడీకి రైల్వే సదుపాయం చేయాలని ఎప్పటి నుంచి చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాలకు చెందిన షిరిడీ భక్తుల కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు వాళ్ల కల నెరవేరింది. తిరుపతి నుంచి షిరిడీ(సాయినాథ్ నగర్) వరకు కొత్తగా ఏర్పాటు కానున్న వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు శనివారం తిరుపతిలో ప్రారంభించనున్నారు. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి, షిరిడీ సాయిబాబ ప్రస్తుతం రాయలసీమలోని వివిధ పట్టణాలకు చెందిన లక్షలాది మంది సాయి భక్తులు షిరిడీ చేరుకోవాలంటే వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది.ఈ విషయమై తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ చొరవ తీసుకుని అనేకసార్లుఢిల్లీలో ప్రధానికి, రైల్వే మంత్రికి విన్నవించారు. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని చర్చించారు. ఈ క్రమంలో కొత్త రైలు శనివారం ప్రారంభం కానుంది. ఈ రైలు శనివారం ప్రారంభిస్తున్ననప్పటికీ అధికారికంగా జనవరి 5వ తేదీ నుంచి తిరుగుతుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







