నలుగురు అమ్మాయిల కథ
- January 22, 2019
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హిమ బిందు వెలగపూడి నిర్మాణంలో బాలు దర్శకత్వంలో తెరకెక్కనుంది. దర్శకుడు బాలు మాట్లాడుతూ 'మహానగరంలో నివసిస్తూ స్వతంత్య్ర భావాలున్న నలుగురు అమ్మాయిలకు సంబంధించిన కథే ఈ చిత్రం. త్రిదా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుం టాయి' అని అన్నారు.
నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ 'హైదరాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో గోవాలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : రఘుకుంచె, సినిమాటోగ్రఫీ : శేఖర్ గంగమోని, పాటలు : భాస్కర భట్ల, లక్ష్మీ భూపాల్, ఎడిటింగ్ : నాగేశ్వర్ రెడ్డి, పి.ఆర్.ఒ: ఫణి - నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్కీ రొలర్ కొస్టర్, లైన్ ప్రొడ్యూసర్ : సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాతలు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







