అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య విచ్చేశారు
- December 26, 2015
వేద ఘోషతో జిల్లాలోని ఎర్రవెల్లిలో ఉన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వర్ధిల్లుతోంది. రిత్విజుల పర్యవేక్షణలో అయుత చండీ మహా యాగం ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్రవెల్లిలో జరుగుతోన్న అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్ రోశయ్యకు శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తీసుకొచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి ప్రతిమను అందజేశారు. ఇరువురు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. అమ్మవారికి మరోసారి దండం పెట్టి రోశయ్య వెనుదిరిగారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







