ఆసియా కప్‌: సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ఉచిత టిక్కెట్స్‌

- January 26, 2019 , by Maagulf
ఆసియా కప్‌: సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ఉచిత టిక్కెట్స్‌

అబుదాబీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, యూఏఈ నేషనల్‌ టీమ్‌ అభిమానులకు ఆసియా కప్‌ 2019 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఉచిత టిక్కెట్లను అందించనుంది. జనవరి 29న యూఏఈ మరియు ఖతార్‌ జట్ల మధ్య ఈ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆదేశాల మేరకు ఉచిత టిక్కెట్లను ఇవ్వనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత టిక్కెట్లను పంపిణీ చేస్తారు. అయితే ఉచిత టిక్కెట్లు కేవలం ఎమిరేటీలకేనా? వలసదారులకు కూడానా? అన్నదానిపై స్పష్టత లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com