మోడీ బహుమతుల వేలం..గంగా ప్రాజెక్టుకు వేలం మొత్తం వినియోగం
- January 27, 2019
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కి బహుమతులుగా వచ్చిన వస్తువులను ఈ నెల 27, 28 తేదీల్లో వేలం వేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ వేలంలో పాల్గొనవచ్చని, మొత్తం 1900 బహుమతులు ప్రధానికి వచ్చినట్లు కేంద్ర సాంస్కృతికశాఖ సహాయ మంత్రి డా.మహేశ్ శర్మ వెల్లడించారు. నమామిగంగే ప్రాజెక్టుకు ఈ వేలంద్వారా వచ్చిన సొమ్మును వినియోగిస్తామని అన్నారు. బహుతుల్లో అత్యధికంగా మెమెంటోలు ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ తన జాతీయ, అంతర్తాజీయ పర్యటనల్లో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయనకు ప్రముఖులు పలువురు అందచేసిన బహుమతులన్నింటినీ ఒకేసారి వేలం వేసి ఆ మొత్తాన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. ఈసారి వేలంద్వారా వచ్చిన మొత్తం నమామి గంగాప్రాజెక్టుకు వినియోగించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ తన మొత్తం బహుమతులన్నింటినీ జాతికే అంకితం చేసారని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా ఏ ఒక్కరయినా సరే వేలంలో పాల్గొనవచ్చని, మొత్తం 1900 బహుమతులను ఎవరైతే ఎక్కువ పాట పాడుకున్నారో వారికి కేటాయిస్తామని మంత్రి మహేశ్‌శర్మ వివరించారు. ప్రధాని నాలుగున్నరేళ్లకాలంలో అత్యధికంగా విదేశీ పర్యటనలు చేసిన ప్రధానిగా నిలిచారు. పొరుగుననే ఉన్న పాకిస్తాన్ నుంచి అతిచిన్న దేశం అయిన ఫిజి ఐలాండ్స్‌ను కూడా సందర్శించారు. జి20 సదస్సులు, జపాన్, చైనా, అమెరికా,ఫ్రాన్స్,రష్యా, యూరోపియన్ దేశాలను సైతం అత్యధికంగా పర్యటించారు. ఈనేపథ్యంలోనే ఆయనకు పలుపర్యాయాలు అత్యధికంగా బహుమతులు అందాయి. ఆదేశ గౌరవార్ధం అందించిన ఈ బహుమతులు అత్యంత అరుదైనవే కాకుండా విలువైనవి కూడా. వీటన్నింటినీ వేలం వేయడంద్వారా వచ్చిన సొమ్ము ఎంత మొత్తం అయినప్పటికీ ఆ మొత్తాన్ని కేవలం నమామి గంగాప్రాజెక్టుకే వినియోగించాలని ప్రధాని నిర్ణయించడంతో ఈ రెండు రోజుల్లోను వేలం పాటలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







