నేటి నుంచి హెచ్-1బి ప్రీమియం ప్రాసెసింగ్
- January 28, 2019వాషింగ్టన్: హెచ్-1బి వీసా దరఖాస్తుల 'ప్రీమియం ప్రాసెసింగ్' ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుందని అమెరికా ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి గానూ దాఖలైన అన్ని 'హెచ్-1బి క్యాప్' పిటిషన్లను పరిశీలించనున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకే ఇది వర్తిస్తుందని, కొత్తవాటిని స్వీకరించట్లేదని స్పష్టం చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ కింద పిటిషన్‌దారులు అదనంగా రుసుము చెల్లించి తమ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను 15 రోజుల్లోపే పూర్తిచేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో పిటిషన్లు పేరుకుపోవడంతో ఇటీవల కొంత కాలం ఈ ప్రక్రియను అమెరికా నిలిపివేసింది. కొన్ని విభాగాల్లో ఈ నిలిపివేత ఇంకా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం