భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేసింది..

- January 28, 2019 , by Maagulf
భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేసింది..

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ట్రైన్‌ 18కు పేరు పెట్టింది కేంద్రం. ఈ రైలును వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలవనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఢిల్లీ-వారణాసి మధ్య రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. 16 కోచ్‌లు కలిగిన ఈ ట్రైన్‌ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. పూర్తి ఎయిర్‌ కండీషన్డ్‌ సదుపాయం ఉన్న ఈ రైలు కాన్పూర్‌, అలహాబాద్‌లో మాత్రమే ఆగుతుంది.

 
ట్రైన్‌ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలను కోరగా, వేల సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి. చివరకు మేము వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశాం. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందిస్తున్న బహుమతి ఇది. ప్రధాని మోడీ దీన్ని త్వరలోనే ప్రారంభించాలని కోరుతున్నా అన్నారు గోయల్‌.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ కంటే వందే భారత్‌ ట్రైన్‌లో ప్రయాణ ఛార్జీలు 40 నుంచి 50 శాతం అధికంగా వసూలు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ఛార్జీలు 2 వేల 800 రూపాయల నుంచి 2 వేల 900 రూపాయల మధ్య ఉండగా.. చైర్‌ కార్‌ 1600 నుంచి 1700 రూపాయలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com