ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు
- January 29, 2019
ఇంటర్ అర్హత ఉన్నవారికి నేరుగా ప్రవేశాలు...అర్హత లేనివారికి ప్రవేశ/ అర్హత పరీక్ష ద్వారా ప్రవేశాలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత లేనివారు ప్రవేశపరీక్షలో అర్హత ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఏ స్టడీసెంటర్ నుంచైనా కోర్సులో చేరడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించి.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువును మార్చి 28గా నిర్ణయించారు. పరీక్ష ఫీజును కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై, 01.06.2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు మాత్రం మూడేళ్ల డిగ్రీలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ విద్యార్హత లేనివారు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో పరీక్షాకేంద్రాన్ని కూడా ఎంచుకోవాలి. రూ.300 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో లేదా ఫ్రాంచైజీ సెంటర్లలో రూ.310 చెల్లించి రసీదు తీసుకోవచ్చు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







