'పవిత్రబంధం' ఫేమ్ ఝాన్సీ ఆత్మహత్య!
- February 06, 2019
పలు తెలుగు టీవీ సీరియల్స్ లో నటించిన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె, తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓ యువకుడిని ప్రేమించి విఫలమైనందునే విరక్తి చెందిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, 'పవిత్రబంధం' సీరియల్ తో ఝాన్సీ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







