విదేశాలకు వెళ్లే వారు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..భారత్ ప్రతిపాదన
- February 06, 2019_resources1-large_1549431355.jpg)
ఢిల్లీ: భారతీయులు ఎందరో కోటి కలలతో విదేశాలకు వెళుతున్నారు. కొందరు జాబ్స్ కోసం వెళుతుంటే.. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫారిన్‌కు వెళుతున్నారు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేయాలని కొందరు.. ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించి మంచి జాబ్ సంపాదించాలని విద్యార్థులు కోరుకుంటారు. ఇలా అనేకమంది ఫారిన్ బాట పడుతున్నారు. కొందరు ఏజెన్సీలు, ఏజెంట్లను నమ్ముకుని ఫారిన్‌కు వెళుతున్నారు. అయితే అక్కడికెళ్లాక మోసపోతున్నారు. ఫేక్ యూనివర్సిటీలు, ఫేక్ ఏజెంట్లు, ఏజెన్సీల కారణంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. జైళ్లకు కూడా వెళుతున్నారు. రీసెంట్గా అమెరికాలో జరిగింది అదే. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో గడుపుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియని పరిస్థితి. వారికి సాయం చేద్దామని అనుకున్నా.. కేంద్ర ప్రభుత్వం వద్ద విద్యార్థుల వివరాలేవీ లేవు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఆ నిబంధనల ప్రకారం.. ఇకపై ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు.. ముందుగా ప్రభుత్వం దగ్గర తమ వివరాలను రిజిస్ట్రర్ చేయించుకోవాలి. విద్యార్థి పేరు, ఊరు, ఏ దేశం వెళుతున్నారు, ఏ కోర్సు, ఎన్ని రోజులు ఇలా అన్ని వివరాలను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఉద్యోగం కోసం వెళ్లే వారు.. ఆ జాబ్ ఏమిటి, ఏ కంపెనీ లాంటి వివరాలను రిజిస్ట్రర్ చేయించుకోవాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇమిగ్రేషన్ బిల్లు 2019లో సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల అభిప్రాయాలు తీసుకుని కొత్త చట్టాన్ని రూపొందించనుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చాక ఉద్యోగాలు, ఉన్నత చదువుల నిమిత్తం ఫారిన్‌కు వెళ్లే ప్రతి భారతీయుడు తన వివరాలను ప్రభుత్వం వద్ద మస్ట్‌గా రిజిస్ట్రర్ చేయించాలి.
ఇలా వివరాలు నమోదు చేయించుకోవడం ద్వారా.. అక్కడ ఏవైనా సమస్యలు తలెత్తినా, ఇబ్బందుల్లో పడినా, మోసపోయినా దౌత్యపరంగా సాయం చేయడానికి భారత ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మన రాయబారి కార్యాలయం ద్వారా అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి తక్షణ సాయం అందించేందుకు వీలుగా ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..