అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన సౌదీ శాటిలైట్‌

- February 06, 2019 , by Maagulf
అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన సౌదీ శాటిలైట్‌

సౌదీ అరేబియా, తన 16వ శాటిలైట్‌ని నింగిలోకి పంపింది. సౌదీ జియో స్టేషనరీ శాటిలైట్‌ 1 (ఎస్‌జిఎస్‌-1) ఫ్రెంచ్‌ గయానా నుంచి ఏరియన్‌ స్పేస్‌ ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. మెరుగైన టెలి కమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, మిడిల్‌ ఈస్ట్‌ అలాగే నార్త్‌ అమెరికా, యూరోపణలలో కమ్యూనికేషన్స్‌ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఈ శాటిలైట్‌ని రూపొందించారు. కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ సిటీ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (కెఎసిఎస్‌టి) టీమ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌తో కలిసి ఈ శాటిలైట్‌ని తయారు చేసినట్లు సౌదీ వర్గాలు పేర్కొన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com