అట్లీ దర్శకత్వం లో విజయ్.!
- February 08, 2019
విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో ఆ తరువాత చేసే సినిమా ఆ స్థాయిదై ఉండాలనే ఉద్దేశంతో, దర్శకుడు అట్లీ కుమార్ కి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. గతంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేసిన తెరి మెర్సల్ చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో మైఖేల్ అనే పాత్రలో విజయ్ కనిపిస్తాడట. అందువలన ఈ సినిమాకి మైఖేల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు, దాదాపు దీనినే ఖరారు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఏజిఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!