అమెరికా గ్రీన్ కార్డులు..భారత్ నిపుణులకు లబ్ధి
- February 09, 2019
విదేశాలకు వెళ్లి సెటిలవ్వాలని ఎంతమందికి ఉండదు. వెళ్లేందుకు తెలివితేటలు, డబ్బు, విజ్ఞానం ఉన్నా.. అక్కడ స్థిరపడాలంటే ఆయా దేశాల కండిషన్స్‌కు తగినట్లే ఉండాలి కదా. ఈ విధంగా చూస్తే అగ్రదేశమైన అమెరికాకు మరిన్ని కండీషన్లు. ఏటా ఉద్యోగ వీసాల కింద 1.4లక్షల మందికి గ్రీన్ కార్డులు ఇస్తున్న యూఎస్.. ఒక్కో దేశానికి 9800మందికి మాత్రమే జారీ చేస్తుందట.
శ్రీలంక, ఇథోఫియా, ఇరాన్ లాంటి చిన్న దేశాల వారు అమెరికాలో స్థిరపడేందుకు దాదాపు దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ సులువైపోతుంది. కానీ, భారత్, చైనా వంటి దేశాలు జనాభా అధికంగా ఉండటంతో ఎంత నైపుణ్యమున్నా.. తమ వంతు వచ్చేంతవరకూ ఆగాల్సిందే. వీరందరికీ సదవకాశం కల్పిస్తూ.. వలసదారులకు గ్రీన్ కార్డుల జారీలో కోటా విధానాన్ని పాటిస్తోన్న అమెరికా.. దాన్ని ఎత్తేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.
అమెరికా చట్టసభల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఆమోదం పొందితే.. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తోన్న భారత్, చైనాలకు చెందిన నిపుణులకు లబ్ధి చేకూరుతుంది. ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 పేరిట ఈ బిల్లును మైక్ లీతో కలిసి భారత అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ బుధవారం సెనేట్‌లో ప్రవేశపెట్టారు.
గతంలో ఇదే తరహా బిల్లులను జో లాఫ్గ్రెన్, కెన్ బక్‌లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యుల మద్దతు ఉంది. ఈ బిల్లును అమెరికా టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్ ఆహ్వానిస్తున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







