24వ మస్కట్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ డేట్స్‌ ప్రకటన

- February 13, 2019 , by Maagulf
24వ మస్కట్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ డేట్స్‌ ప్రకటన

మస్కట్‌: 24వ మస్కట్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌కి సంబంధించి తేదీల్ని మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 21న ఈ ఫెయిర్‌ ప్రారంభమవుతుంది. ఒమన్‌ కన్వెన్షన్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో 21 ఫిబ్రవరి నుంచి 2 మార్చి వరకు ఈ ఎగ్జిబిషన్‌ కొనసాగుతుంది. పిబ్రవరి 20 రాత్రి 7 గంటలకు బుక్‌ ఫెయిర్‌ ప్రారంభమవుతుందని మినిస్టర్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ డాక్టర్‌ అబ్దుల్‌ మౌనిమ్‌ బిన్‌ మన్సౌర్‌ అల్‌ హాస్సాని చెప్పారు. 30 దేశాల నుంచి 882 పబ్లిషింగ్‌ హౌసెస్‌ ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయి. తొలిసారిగా చైనా, కెనడా, శ్రీలంక మరియు బల్గేరియా ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నట్లు మినిస్టర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com