అక్రమ కార్మికులకు అమ్నెస్టీ చివరి అవకాశం

- December 27, 2015 , by Maagulf
అక్రమ కార్మికులకు అమ్నెస్టీ చివరి అవకాశం

జులై నుంచి డిసెంబర్‌ వరకు ఏర్పాటు చేసిన అమ్నెస్టీని వినియోగించుకోవాలని అక్రమ కార్మికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌ 31తో ఈ అవకాశం ముగియనుంది. సుమారు 8 వేల మంది వలసదారులు అమ్నెస్టీ ద్వారా సాంత్వన పొందనున్నారు. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా బహ్రెయిన్‌లోకి ప్రవేశించి ఇక్కడి చట్టాలకనుగుణంగా ఇబ్బందులు పడ్తున్న అక్రమ కార్మికుల కోసం ఆరు నెలల గడువుతో అమ్నెస్టీ అవకాశం కల్పించింది. 'నేషనాలిటీ పాస్‌పోర్ట్స్‌ మరియు రెసిడెన్స్‌ ఎఫైర్స్‌ (ఎన్‌పిఆర్‌ఎ) అన్ని ప్రక్రియలూ పూర్తి చేసి, గడువును ప్రకటించింది. ఎన్‌ఆర్‌పిఏ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ ఫర్‌ ఎగ్జిట్స్‌, సెర్చ్‌ అండ్‌ ఫాలో అప్‌ బ్రిగేడియర్‌ యూసఫ్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఘాతం, ఎంబసీలు తమవారిని గుర్తించి, ప్రాసెస్‌ని పూర్తి చేయాలనీ, లేదంటే గడువు దాటిన తర్వాత అక్రమ కార్మికులపై చట్టాలకనుగుణంగా శిక్షలు విధించబడ్తాయని అన్నారు. అలాగే, ఎన్‌పిఆర్‌ఏ ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తుందనీ, చట్టాల్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com