ఒక్కటవ్వనున్న ఆర్య, సాయేషా
- February 14, 2019
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని ఆర్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి' అని పేర్కొంటూ అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపారు.
ఆర్య, సాయేషా 'గజినీకాంత్' చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే ఇరు వైపు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు. గతంలో ఆర్య 'ఎంగ వీటు మాప్పిళ్లై' పేరిట స్వయంవర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదే కార్యక్రమంలో తనకు నచ్చిన అమ్మాయిని ఎంచుకుని పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం వివాదాస్పదం కావడంతో ఆపేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







