లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు- ఎన్టీఆర్..
- February 14, 2019
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవిత కథను లక్ష్మీ పార్వతి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.లో '1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి'.. అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య ఎమోషనల్ సీన్స్.. జీవితం.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా.. మలుపు తిరుగుతుందో ఎవ్వరికి అర్థం కాదు అని ఎన్టీఆర్ అనడం.. తన ఫ్యామిలీ వేరే వారిని నమ్మడం.. జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడం అని ఎన్టీఆర్ చెప్పడం.. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టడం.. లక్ష్మీ పార్వతికి తాళి కట్టడం లాంటి సన్నివేశాలని ఈ ట్రైలర్‌లో కట్ చేశారు.. చిత్రంలో యజ్ఞాశెట్టి 'లక్ష్మీపార్వతి' పాత్రలో , ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు నటిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ కనిపించనున్నాడు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ను మీరూ చూడండి..
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







