మరో తమిళ నటి ఆత్మహత్య
- February 15, 2019
చెన్నై : రంగుల ప్రపంచంలో వెలిగిపోదామని గంపెడాశతో నటానరంగంలోకి అడుగు పెట్టిన కొందరి జీవితాలు సగంలోనే అంతరించిపోతున్నాయి. నటన కోసమని వచ్చి మోసపోయేవారు ఎంతోమంది. దగాపడి జీవితాలను ఆత్మహత్యలతో అంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో నటి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళ సినీ నటీ..టీవీ నటి అయిన యషిక చెన్నైలోని వడపళనిలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణం తాను ప్రేమించిన వాడేనంటు తెలిపింది.
తిరుప్పూరుకు చెందిన యషిక అసలు పేరు మేరీ షీలా జబరాని. వడపళనిలోని ఓ హాస్టల్‌లో ఉండే యషిక పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజలు క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తిన క్రమంలో మనస్తాపం చెందిన యషిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తన ఆత్మహత్య చేసుకునే క్రమంలో తనను మోసం చేసినవాడిని వదలొద్దు అంటు తల్లికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించింది.
యషిక ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు యషిక ఇంటికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తల్లికి పంపించిన వాట్సాప్ మెసెజ్ పంపించిన విషయం తెలుసుకుని ఆమె మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. పలు సీరియళ్లలో నటించిన యషిక.. విమల్ హీరోగా నటించిన 'మన్నార్ వగెరా' సినిమాలో నటించింది. యషిక మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







