స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో ఉద్యోగ అవకాశాలు

- February 15, 2019 , by Maagulf
స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో ఉద్యోగ అవకాశాలు

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నిర్వహించే జూనియర్ ఇంజనీర్స్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్)-2019 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్‌బి (నాన్ గెజిటెడ్) స్థాయిలో నియమితులయ్యే వీరికి ఏడో వేతన సంఘం ప్రకారం రూ.35,400 నుంచి 1,12,400 వేతన స్కేలు లభిస్తుంది. 
పోస్టుల వివరాలు..
1.సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ (సివిల్)
2.సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)
3.సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) జూనియర్ ఇంజనీర్ (సివిల్)
4.సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
5.డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ జూనియర్ ఇంజనీర్ (సివిల్)
6.మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ (సివిల్)
7.మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్)
8.మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్(ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ (క్వాంటిటీ సర్వేయంగ్ అండ్ కాంట్రాక్ట్)
9.ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజనీర్ (సివిల్)
10.ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
11.ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)
12.బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజనీర్ (సివిల్)
13.సెంట్రల్ వాటర్ అండ్ పరవ్ రీసెర్చ్ స్టేషన్ జూనియర్ ఇంజనీర్ (సివిల్)
14.సెంట్రల్ వాటర్ అండ్ పరవ్ రీసెర్చ్ స్టేషన్ జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ )
15.సెంట్రల్ వాటర్ అండ్ పరవ్ రీసెర్చ్ స్టేషన్ జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)
16.డైరక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్) జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)
17.డైరక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నేవల్) జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
18.నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్‌ఓ) జూనియర్ ఇంజనీర్ (సివిల్)
19.నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్‌ఓ) జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
20.నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్‌ఓ) జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)


 
వయసు: సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేవారు 2019 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లకు మించకూడదు. అదేవిధంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు 27 ఏళ్లు, మిగతా విభాగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నింబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అర్హత: ఆయా విభాగాలను బట్టి సంబంధిత ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా ఉండాలి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఫిబ్రవరి 25
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 2019 ఫిబ్రవరి 27
పేపర్-1 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేదీ : 2019 సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు 
పేపర్-2 (కన్వెన్షల్) పరీక్ష తేదీ : 2019 డిసెంబర్ 29
ఇతర వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
పరీక్షకు సంబంధించి సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రణాళికాబద్ధంగా మాక్‌టెస్ట్‌లను ప్రాక్టీస్ చేస్తుంటే ఉద్యోగాన్ని ఈజీగా పొందవచ్చు. దాంతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఆల్‌ది బెస్ట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com