పాకిస్తాన్‌ కు వార్నింగ్‌ ఇచ్చిన మోడీ

- February 15, 2019 , by Maagulf
పాకిస్తాన్‌ కు వార్నింగ్‌ ఇచ్చిన మోడీ

కాశ్మీర్‌ దాడి తర్వాత దేశంలో ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతుందని.. ప్రతీకారం తీర్చుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్తాన్‌ కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అటు తీవ్రవాద సంస్థలను హెచ్చరించారు. దేశం ప్రగతిని అడ్డుకునేందుకు తీవ్రవాదులు కుట్రలు చేస్తున్నారని.. అవేమీ అభివృద్ధిని ఆపలేవన్నారు. దేశం రెట్టించిన ఉత్సాహంతో మరింత ప్రగతి సాధించి అమరులకు నిజమైన నివాళి అర్పిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌ తగిన మూల్యం చెల్లించేరోజు వస్తుందన్నారు. ఉగ్రవాదులు, ఐఎస్‌ఐ లాంటి సంస్థలు కుట్రలను ఛేదించడానికి సైనికులు ఏకమవుతారన్నారు. దేశప్రజలంతా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారన్నారు. ఇలాంటి దాడులతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని మోదీ గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com