ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలను నరికి, వాటిని ఊళ్లోప్రదర్శించారు!
- December 27, 2015
ఇన్నాళ్లూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఘాతుకాలు చేయడం చూశాం. తమకు నచ్చనివాళ్లను బందీలుగా పట్టుకుని వాళ్ల తలలు నరికేయడం, నేరుగా తలపై తుపాకితో కాల్చి సముద్రంలో పారేయడం లాంటివి మనకు తెలుసు. కానీ ఇటీవలి కాలంలో తొలిసారిగా.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల తలలను నరికి, వాటిని ఊళ్లో మెయిన్ రోడ్డు వద్ద ప్రదర్శించారు! ఈ ఘటన అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్ ప్రాంతంలో జరిగింది. ఓ అఫ్ఘాన్ మంత్రికి అత్యంత నమ్మకస్థులుగా ఉండే గ్రామ మిలీషియా సభ్యులు ఈ పనికి పాల్పడ్డారు. దీంతో ఐఎస్ఐఎస్కు, దాని ప్రత్యర్థులకు మధ్య దారుణమైన హింసాత్మక ఘటనలు అఫ్ఘాన్‌లో పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అఫ్ఘాన్‌లో ఇన్నాళ్లూ తాలిబన్లదే రాజ్యం. అక్కడ వాళ్లు గీసిన గీత దాటడానికి వీల్లేదు. కానీ ఇటీవలి కాలంలో ఐఎస్ఐఎస్ కూడా అఫ్ఘాన్ గ్రామాల్లోకి చొరబడి, అక్కడ బలం పుంజుకోడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకోడానికి అఫ్ఘాన్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ హాజీ జాహిర్కు నమ్మకస్థులైన స్థానిక మిలీషియా సభ్యులు మాత్రం అటు తాలిబన్లతోను, ఇటు ఇస్లామిక స్టేట్ ఉగ్రవాదులతోను కూడా పోరాడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ మిలీషియాకు చెందిన నలుగురు సభ్యులనుఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని తలలు నరికేశారు. దానికి ప్రతీకారంగా, నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మిలీషియా సభ్యులు పట్టుకుని, వాళ్ల తలలు నరికేసి, ఊళ్లోని మెయిన్ రోడ్డులో ప్రదర్శనగా పెట్టారు. ఈ ఘటనను డిప్యూటీ స్పీకర్ సమర్థించినట్లు కూడా తెలుస్తోంది
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







