కాశ్మీర్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన ఒమన్‌

- February 16, 2019 , by Maagulf
కాశ్మీర్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన ఒమన్‌

మస్కట్‌: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన తీవ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించింది ఒమన్‌. ఈ ఘటనలో భారత పారామిలిటరీ ఫోర్స్‌కి చెందిన 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఒమన్‌, సంతాప ప్రకటనలో పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. భారతదేశంలో ఈ దాడి జరగడం తమకు బాధ కలిగించిందనీ, ఉగ్రవాదాన్ని తరిమికొట్టే క్రమంలో భారత్‌ సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి ఒమన్‌ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని ఒమన్‌ పేర్కొంది. ఈ ఘటనలో క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ఒమన్‌ ఆకాంక్షించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com