స్పోర్ట్స్ డే: క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించిన సిబిఎ
- February 16, 2019
బహ్రెయిన్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇసా టౌన్‌లోని నేషనల్ స్టేడియం గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్‌ని మహిళలు, పురుషుల కోసం నిర్వహించింది సిబిఎ. రెండు మహిళల, రెండు పురుషుల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. మహిళా జట్లు అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాయి. 10 ఓవర్ల గేమ్‌లో వీరు చూపిన ప్రతిభ పట్ల అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కన్నడ సంఘ బహ్రెయిన్ టీమ్, బహ్రెయిన్ స్పోర్ట్స్ డే టోర్నమెంట్‌ని గెల్చుకుంది. నూర్ స్పోర్ట్స్ బహ్రెయిన్ టీమ్‌పై కెఎస్బి విజయం సాధించింది. కాగా, మరో మ్యాచ్ లంగూనా బీచ్ బహ్రెయిన్, షాహికో సర్వీసెస్ బహ్రెయిన్ టీమ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎల్బిబి టీమ్ ఘనవిజయాన్ని సాధించింది. ఎల్బిబి - ఎస్ఎస్బి టీమ్స్ మధ్య 20 ఓవర్ల మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







