రక్తదానంపై అవగాహన పెరగాలి
- December 28, 2015
రక్తదానంపై అవగాహన పెరగాల్సి ఉందని, ఓ వ్యక్తి 400 మిల్లీ లీటర్ల రక్తాన్ని దానం చేస్తే, అది ఆపద సమయంలో ఉన్న ముగ్గురికి ఉపయోగపడ్తుందని వైద్యులు వెల్లడించారు. ఒమన్‌లో పెరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ వలన అత్యవసరంగా రక్తం అవసరమవుతోందనీ, బాధితులకు రక్తం అందించడంలో రక్త నిధి కేంద్రాలు ఒక్కోసారి రక్తం కొరతను ఎదుర్కొంటున్నాయని సలాహ్ లైఫ్‌లైన్ హాస్పిటల్ 'ఆపరేషన్స్ డైరెక్టర్' డాక్టర్ ఆసిఫ్ గని చెప్పారు. మెడికల్ డైరెక్టర్ షాహిద్ యూసఫ్ మాట్లాడుతూ, రక్తదానంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ, రక్త దానం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సేఫ్ అనీ, తద్వారా శరీరంలోని కొలెస్టరాల్ లెవల్స్‌ని తగ్గించుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఓసారి రక్తదానం చేశాక చాలా తక్కువ సమయంలోనే ఆ రక్తం రికవరీ చేయబడ్తుందనీ, ఈ క్రమంలోనే బోన్ మ్యారో కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఎన్జివోలు, స్వచ్ఛంద సంస్థలు రక్త దానంపై చేపడ్తున్న అవగాహనా కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా చేపట్టవలసి ఉందని డాక్టర్ ఆసిఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







