న్యూ ఇయర్ వేడుకలు: మెట్రోలో 900,000
- December 28, 2015
నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వెళ దుబాయ్ మెట్రో 900,000 మందికి సేవలు అందించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క జనవరి 1వ తేదీనే 480,000 మంది మెట్రోను ఉపయోగించుకోనున్నారట. బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో ట్రాఫిక్‌ని క్రమబద్దీకరించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ ఉదాయ్ చెప్పారు. వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు, వీలైనంత ఎక్కువగా బస్సుల్ని కూడా నడపనున్నట్లు వివరించారామె. ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్, మహమ్మద్ బిన్ రషీద్ బౌలెవార్డ్‌లను డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఉపయోగించకపోవడం మంచిదని ఆమె వాహనదారులకు సూచించారు. దుబాయ్ సెంటర్ వద్ద 1500, అల్ వస్ల్ క్లబ్ 2000, అల్ జఫ్లియా 500, జబీల్ పార్క్ 1000 అదనపు వాహనాల పార్కింగ్‌తో సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. 170 బస్సుల్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తారు. వీలైనంతవరకు మెట్రో సర్వీసుల్ని ఉపయోగించుకోవాలనీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను ఉపయోగించడం సేఫ్ అనీ, ప్రైవేటు వాహనాల్ని వినియోగించడం మంచిది కాదని అధికారులు సూచిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా మెట్రో స్షేన్ గురువారం 10 గంటల నుంచి మూసివేయబడ్తుంది. ఫైనాన్షియల్ సెంటర్, బిజినెస్ బే స్టేషన్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది మెట్రో వినియోగదారులు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







