భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డ్
- February 25, 2019

మన భారతీయ సినిమా ఒక్కటైనా ఆస్కార్ గెలుచుకుంటే బాగుంటుంది అనేది ప్రతీ సినీ అభిమాని, సినీ పరిశ్రమకు చెందిన వారందరి కల. ఏదైనా సినిమాకి, సినిమాలో నటించిన నటీనటులకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే.. భారతీయులం అంతా చాలా గొప్పగా ఫీలవుతాం. అంతకన్నా గొప్ప అవార్డు ఇంకేమీ లేదు కూడా. అంత ప్రాముఖ్యత ఉంది. అడపా దడపా మన సినిమాలు నామినేషన్ల వరకు వెళుతున్నవీ ఉన్నాయి. ఇప్పుడు ఓ షార్ట్ ఫిల్మ్ భారతీయ సినిమాకు ఆస్కార్ కలను నిజం చేసింది.
మహిళలు ప్రతీ నెలా ఎదుర్కొనే రుతు క్రమంను ప్రధానంగా తీసుకుని భారత గ్రామీణ అంశంగా తీసిన షార్ట్ ఫిల్మ్ 'పీరియడ్-ఎండ్ ఆఫ్ సెంటెన్స్'. ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్(అకాడమీ) అవార్డుల్లో సత్తా చాటింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డును ఈ సినిమా దక్కించుకుంది. రేఖ జెహతబ్చి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింను గునీత్ మోంగాకు చెందిన సిక్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. శానిటరీ ప్యాడ్ల ఆవశ్యకత గురించి ప్రధానంగా తెలియజేసే ఈ షార్ట్ ఫిలింను లాస్ఏంజెల్స్లోని ఓక్‌ఉడ్ స్కూల్ విద్యార్థులు, వారి టీచర్ బెలిసా బెర్టన్ ప్రారంభించారు. ఢిల్లీ శివారులోని కతికెరా గ్రామం నేపథ్యంగా కథ నడుస్తుంది.
శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేని కాలంలో బహిష్టు సమయంలో మహిళలు, బాలికలు ఎదుర్కొనే సమస్యలు, వారు ఎదుర్కొనే ఆంక్షలు భారత్ లో ఎలా ఉంటాయనే విషయమై ఇందులో చూపించారు. తర్వాత శానిటరీ ప్యాడ్లు అమ్మే మిషన్‌ను గ్రామంలో ఏర్పాటు చేయడం, తర్వాత తమపై ఉన్న ఆంక్షల నుంచి మహిళలు బయటకు రావడం, వారే సొంతంగా ప్యాడ్లను తయారు చేయడమే కాక, 'ఫ్లై' పేరుతో వాటిని అమ్మి.. సాధికారితను సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచే కథాంశంతో ఈ లఘు చిత్రం కొనసాగుతుంది.
ఈ సినిమా నిర్మాణంలో స్నేహ్(22) కథానాయకిగా నటించింది. ఢిల్లీకి దగ్గరలోని కతికెరా గ్రామంలో శానిటరీ ప్యాడ్స్ తయారుచేసే ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తున్నారు. లాస్ ఏంజెలిస్‌లో జరగిన ఆస్కార్ వేడుకలకు స్నేహ్ హాజరయ్యారు. గ్రామంలో నివసించే స్నేహ్ ఈ షార్ట్ ఫిల్మ్ లో నెలసరి సమయాల్లో, మహిళలు అపవిత్రం అని భావించి, వారిని గుళ్లుగోపురాలకు, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచడంపై పోరాడే యువతిగా కనిపించింది.
కతికెరా గ్రామ పంటపొలాల్లో, గ్రామ పాఠశాలలోని తరగతి గదుల్లో ఈ డాక్యుమెంటరీ తీశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఈ గ్రామంలో కూడా, మహిళల నెలసరి గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ లో లేవనెత్తారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు ఆస్కార్ దక్కింది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ దక్కడంపై ప్రశంసలు అందుకుంటున్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







