పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా
- February 27, 2019
పాకిస్థాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇండియాతో పెట్టుకోవద్దనీ..అలా చేస్తే పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇండియాపై దాడులకు పాల్పడి కవ్వించే చర్యలు చేయవద్దని హితవు పలికారు. ఈ క్రమంలో పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ వెంటనే నాశనం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
పాకిస్థాన్ ఏ ఒక్క ఉగ్రవాదికి మద్దతు పలికినా..అది దేశాని వినాశనానికి దారి తీస్తుందని..ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న మీడియాతో మాట్లాడిన ట్రంప్ పాకిస్థాన్ కు హితవు పలికారు. పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదంపై తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని ఎంతో కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తాము కోరుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు కూడా అదే మాట చెబుతున్నామని అన్నారు. యుద్ధమే జరిగితే అత్యధిక నష్టం పాక్ కు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







