భారత్ సర్జికల్ స్ట్రైక్.. తలపట్టుకున్న ఇమ్రాన్ ఖాన్
- February 27, 2019
భారత్ సర్జికల్ స్ట్రైక్స్స్ పాకి స్థాన్లో వణుకు పుట్టించాయి. ఇండియన్ ఆర్మీ ఇలా దాడులు చేస్తుందని ఊహించనే లేదు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దీంతో ఎలా స్పందించాలో అర్ధం గాక తలపట్టుకుంటున్నారాయన. మరోవైపు గంటకో పాట, పూటకో మాట అన్నట్లుగా వ్యవహరించి తమ దేశ ప్రజల్ని తికమక పెట్టింది పాక్ ప్రభుత్వం. అసలు వైమానిక దాడులు చేయలేదని బుకాయించింది.
ప్రధాని, ఆర్మీలు పరస్పరం విరుద్దంగా మాట్లాడడంతో పాకిస్థాన్ నవ్వులపాలంది. ఆ దేశ రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ వ్యాఖ్యలతో మరింత అబాసు పాలైంది. భారత్‌ను తిప్పికొట్టేందుకు తమ వైమానిక దళం సిద్ధంగానే ఉన్నా.. రాత్రివేళ చీకటిగా ఉండడంతో స్పందించలేదంటూ పర్వేజ్ ఖటక్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా తలదించుకునేలా చేశాయి.
ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న కీలక మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారరు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అనంతరం జాతీయ భద్రతా దళంతో భేటీ అయ్యారు. భారత్ దాడులకు తాము సమయం, సందర్భం చూసుకొని సరైన సమాధానమిస్తామన్నారు.
మరోవైపు భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌పై చర్చించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఇవాళ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలను జారీచేశారు. భారత దాడికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న దానిపై ఇందులో చర్చించనున్నారు. అటు.. భారత విమానాలు నియంత్రరేఖను ఉల్లంఘించాయంటూ పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







