అబుదాబి చేరిన భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- March 01, 2019
అబుదాబి: ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అబుదాబి చేరారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న సుష్మ.. ఓఐసీ భాగస్వామ్య దేశాలతో భారత్ సంబంధాలపై ప్రసంగించనున్నారు. దీనికోసం యూఏఈ విదేశాంగ మంత్రి హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రత్యేకంగా సుష్మను ఆహ్వానించారు. ఈ సమావేశానికి భారత్ హాజరైతే తాము పాల్గొనబోమని పాక్ బెదిరించినా. వారి బెదిరింపులను లెక్కచేయని నహ్యాన్ సుష్మను సమావేశానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్ స్వయంగా ఇరుదేశాల ప్రధానులతో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించువాలని సూచించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







