మోడీ ఇమ్రాన్‌లతో మాట్లాడిన షేక్‌ మొహమ్మద్‌.!

- March 01, 2019 , by Maagulf
మోడీ ఇమ్రాన్‌లతో మాట్లాడిన షేక్‌ మొహమ్మద్‌.!

భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులతో ఫోన్‌లో మాట్లాడినట్లు యుఏఈ ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీం కమాండర్‌, అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ చెప్పారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పిన క్రౌన్‌ ప్రిన్స్‌ చర్చలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌తోనూ, నరేంద్రమోడీతోనూ విడి విడిగా మాట్లాడినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. యుఏఈ ఇరుదేశాలతోనూ స్నేహ సంబంధాలు కోరుకుంటోందని ఆయా దేశాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారనీ, అందరూ శాంతిని కోరుకుంటున్నారనీ ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే భారత వైమానిక దళానికి చెందిని వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ని విడుదల చేసేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ సుముఖత వ్యక్తం చేశారు. కాసేపట్లో అభినందన్‌ని విడుదల చేయనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com