మహాశివరాత్రి: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
- March 04, 2019
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు చివరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 49 రోజులపాటు జరిగిన కుంభమేళా ఈ రోజుతో పూర్తికానుంది. శివరాత్రినాడు కుంభమేళాలో 80 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనావేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కుంభమేళాలో భద్రతను మరింతగా పెంచారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ మొత్తం 22 కోట్ల మంది స్నానమాచరించారు. కుంభమేళా పర్యవేక్షణాధికారి విజయ్ కిరణ్ మాట్లాడుతూ మేళాలో చివరి రోజున పుణ్య స్నానాలకు అధికసంఖ్యలో భక్తులు రానున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







